తొలి శుభోదయం న్యూస్ ఉలవపాడు :-
పంచాయతీలో మొత్తం 1671 పాస్ పుస్తకాలకు గాను, ప్రస్తుతం ఎలాంటి తప్పులు లేని 532 పుస్తకాలను రైతులకు అందజేశాను. మిగిలిన పుస్తకాలలో ఉన్న లోపాలను సరిచేసి త్వరలోనే అందజేస్తాము.
గత పాలనలో జరిగిన రీసర్వే లోపాల వల్ల రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆ తప్పులను సవరించి ప్రతి రైతుకూ న్యాయం చేయడం కూటమి ప్రభుత్వ బాధ్యతగా తీసుకున్నాము.ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రైతుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ పారదర్శక విధానాలు అమలు చేస్తున్నాము. ప్రస్తుతం క్యూ ఆర్ కోడ్‌తో కూడిన పాస్ పుస్తకాలను అందించడం ద్వారా భూమి వివరాలు సులభంగా తెలుసుకునే అవకాశం కల్పించాం.
రీసర్వే సమస్యల పరిష్కారానికి త్వరలోనే గ్రామసభలు నిర్వహించి, ప్రతి రైతు సమస్యను ప్రత్యక్షంగా విని పరిష్కరిస్తాము.