తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-

మహిళల భద్రతను అత్యంత ప్రాధాన్యతగా భావిస్తూ ప్రకాశం మరియు మార్కాపురం జిల్లా పోలీసులు ‘శక్తి’ యాప్ వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ, ఆపదలో ఉన్న మహిళలకు ఈ యాప్ ఒక భరోసా అని, అత్యవసర పరిస్థితుల్లో పోలీసుల సహాయం పొందడానికి ఇది అత్యంత సులభమైన మార్గమని తెలిపారు. మహిళా పోలీసులు వివిధ విద్యాసంస్థలు మరియు బహిరంగ ప్రదేశాల్లో పర్యటించి, విద్యార్థినుల మొబైల్స్‌లో యాప్‌ను డౌన్లోడ్ చేయించారు. ఆకతాయిల వేధింపుల నుండి రక్షణ పొందడానికి సాంకేతికతను ఆయుధంగా మలుచుకోవాలని, ‘శక్తి’ యాప్ ద్వారా పోలీసులు ఎల్లప్పుడూ మీకు అండగా ఉంటారని భరోసా ఇచ్చారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *