జియ్యమ్మవలస/పార్వతీపురం, / అక్టోబర్ 29 : బలిజిపేట మండలం వంతరాం గ్రామాన్ని జిల్లా కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్డి బుధవారం సాయంత్రం సందర్శించారు. వరద ముంపు ప్రాంతమైన వంతరాం గ్రామస్తులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ముంపు బాధితులకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని, సమస్యలు పరిష్కరానికి కృషి చేస్తామని అన్నారు. కేజీబీవి వసతి గృహాన్ని సందర్శించి రెండు రోజులు పాటు కరెంటు లేకపోవడంతో కలెక్టర్ కి తెలియచేసారు, వెంటనే స్పందించి అక్కడ ఎలక్ట్రికల్ సిబ్బంది తో మాట్లాడి కరెంటు తెప్పించారు. ఈ నేపథ్యంలో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఏ ఈ ని కలెక్టర్ సస్పెండ్ చేసారు. పిల్లల ఆరోగ్యం పట్ల ఆరా తీశారు. హాస్టల్ లో అందుతున్న విద్యా, భోజన వసతి సౌకర్యాలను విద్యార్థులను అడిగి తెలుసుకొని సంతృప్తిని వ్యక్తం చేశారు. ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలతో విద్యార్థులు బాగా చదువుకుని వృద్ధిలోకి రావాలని ఆకాంక్షించారు. తుఫాన్ లో విధులు నిర్వహించిన ప్రతి అధికారిని కలెక్టర్ అభినందనలు తెలియచేసారు అనంతరం నూకలవాడలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని సందర్శించి, అక్కడి వసతి ఏర్పాట్లపై ఆరా తీశారు. నిర్వాసితులకు అవసరమైన అన్ని మౌలిక వసతులు కల్పించాలని, నాణ్యమైన ఆహారాన్ని అందించాలని అధికారులను ఆదేశించారు. నివాసితులకు అన్ని వేళలా అండగా ఉండాలని కలెక్టర్ అధికారులకు హితవు పలికారు. చికెన్ తో భోజనం పెట్టడంతో పాటు అధికారులు, ప్రజాప్రతినిధులు బాగా చూసుకొంటున్నారని నివాసితులు కలెక్టర్ కు అభినందనలు తెలిపారు. ఈ పర్యటనలో సబ్ కలెక్టర్ ఆర్. వైశాలి, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.