తొలి శుభోదయం సింగరాయకొండ:-

ప్రకాశం జిల్లాలో కొండపి నియోజకవర్గంలో సింగరాయకొండ మండలంలో మూలగుంటపాడు పంచాయితీలో విద్యానగర్ 8వ లైన్ లో గణేష్ విగ్రహ కమిటీ వారు సంక్రాంతి సంబరాల్లో భాగంగా ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జనసేన పార్టీ కొండపి నియోజకవర్గ సమన్వయకర్త కనపర్తి మనోజ్ కుమార్ పాల్గొని ముగ్గుల పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు చిగురుపాటి శేషగిరిరావు, జనసేన పార్టీ సింగరాయకొండ మండల అధ్యక్షులు ఐనాబత్తిన రాజేష్, జరుగుమల్లి మండల అధ్యక్షులు గూడా శశిభూషణ్, అధిక సంఖ్యలలో మహిళలు మరియు గణేష్ విగ్రహ కమిటీ వారు పాల్గొని సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటే విధంగా నిర్వహించారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *