తొలి శుభోదయం న్యూస్ కనిగిరి:-

సోమవారం కనిగిరి మున్సిపల్ కార్యాలయం వద్ద మున్సిపల్ కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ 12వ పిఆర్సి ని వెంటనే ప్రకటించాలని, మున్సిపల్ కార్మికులందరికీ ప్రభుత్వమే జీతాలు చెల్లించాలన్నారు .కార్మికులందరికీ నెలకి కనీస వేతనం రూ26,000 చెల్లించాలని,ఎన్ ఎం ఆర్, బదిలీ, కోవిడ్, ఎం – బుక్, డైలీ వేజ్, క్లాప్ డ్రైవర్లకు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలన్నారు.
గత 17 రోజులు సమ్మె కాలపు ఒప్పందాలైన రిటైర్మెంట్ బెనిఫిట్స్, దహన సంస్కారాలకు ఆర్థిక సహాయం, ఎక్రేషియో పెంపు
సంక్షేమ పథకాల అమలకు జీవోలు జారీ చేయాలన్నారు.
రిటైర్మెంట్, చనిపోయిన, అనారోగ్యం పాలైన వారి స్థానంలో వారి పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలని,రూ.24500 జీతం పొందే వారికి హెల్త్ కార్డులు ఇవ్వాలన్నారు.
పదవీ విరమణ వయస్సు 62 ఏళ్ళకు పెంచాలని. గ్రాట్యూటి చెల్లించాలని.పర్మినెంట్ ఉద్యోగులు, కార్మికులకు డిఎ, సరండర్ లీవ్ల బకాయిలు వెంటనే చెల్లించాలన్నారు.పట్టణాల విస్తరణ మేరకు సిబ్బంది సంఖ్యను పెంచాలని. పనిముట్లు, భద్రతా సౌకర్యాలు సకాలంలో అందించాలని అర్హులైన వారందరికీ ఇళ్లు, ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు పి నరేంద్ర, మున్సిపల్ యూనియన్ నాయకులు ఓబయ్య, చార్లెష్, శేషయ్య, బాలస్వామి, ప్రభుదాసు, బ్రహ్మయ్య, గరటయ్య, మార్క్, దస్తగిరి,ఈశ్వరమ్మ, రమణమ్మ, అచ్చమ్మ తదితరులు పాల్గొన్నారు

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *