తొలి శుభోదయం ప్రకాశం:-
ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం మూలగుంటపాడు గ్రామ బైపాస్ రోడ్డులో ఉన్న శ్రీ పోలేరమ్మ అమ్మవారి ఆలయం పునర్నిర్మాణం కోసం దేవాదాయ శాఖ ద్వారా ₹50 లక్షల నిధులు మంజూరు కావడంతో గ్రామవ్యాప్తంగా ఆనందం వ్యక్తమైంది. ఈ నిధుల మంజూరుకు రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డా. డోలా బాల వీరాంజనేయ స్వామి కి, అలాగే మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్యనారాయణకి గ్రామస్థులు కృతజ్ఞతలు తెలిపారు.గ్రామస్తులు వెల్లడించిన వివరాల ప్రకారం, ఆలయ పునర్నిర్మాణానికి ప్రభుత్వం ప్రత్యేక నిబంధనలతో ఆమోదం ఇవ్వగా, గ్రామ ప్రజలు ఒక నెల రోజులలోపు రూ. 16,67,00/- (మ్యాచింగ్ గ్రాంట్) సమకూర్చినట్లయితే, ప్రభుత్వం ₹33 లక్షలు 33 వేల రూపాయలు అదనంగా మంజూరు చేసేలా రాష్ట్ర దేవాదాయ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు. ఆలయ అభివృద్ధికి గ్రామస్థులు ఐక్యంగా ముందుకు రావడం గ్రామాభివృద్ధిలో ముఖ్యమైన అడుగుగా భావిస్తున్నారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సన్నెబోయిన శ్రీనివాసులు, నక్కా ముసలయ్య, నరాల సుధాకర్, అంబటి బ్రహ్మయ్య, తిరుపతి, వార్డు సభ్యుడు వెంకటరావు, నక్కా మధు, మురళి, మిరియం మోహన్, అంబటి శ్రీహరి, సన్నెబోయిన వెంకటేశ్వర్లు, ప్రభాకర్, బాలాజీ, అశోక్ తదితరులు పాల్గొని ఆలయ అభివృద్ధికి సంకల్పం వ్యక్తం చేశారు.గ్రామ పెద్దలు మాట్లాడుతూ పోలేరమ్మ అమ్మవారి ఆలయం గ్రామ గౌరవానికి చిహ్నం. ప్రభుత్వం నిధులు మంజూరు చేయడం ఎంతో ఆనందంగా ఉంది. మేము మ్యాచింగ్ గ్రాంట్‌ను నిర్ణీత కాలంలో సమకూర్చి ఆలయ పునర్నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేస్తాము” అని తెలిపారు.