తొలి శుభోదయం ప్రకాశం:-
ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా మైనర్ డ్రైవింగ్‌పై ప్రత్యేక డ్రైవ్‌ను పోలీస్ అధికారులు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మైనర్‌ల చేత వాహనాలు నడపడం వల్ల కలిగే ప్రమాదాలపై తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చారు.
తల్లిదండ్రులు తమ పిల్లలకు వాహనాలు ఇవ్వకుండా జాగ్రత్త వహించాలని, ట్రాఫిక్ నిబంధనలను కచ్చితంగా పాటించాలని సూచించారు.డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడపడం చట్టపరమైన నేరమని, ఇటువంటి చర్యలు కుటుంబాల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతాయని పోలీసులు వివరించారు.
పిల్లల భద్రత, ప్రజల భద్రత దృష్ట్యా ఇలాంటి ప్రత్యేక డ్రైవ్‌లు కొనసాగుతాయని అధికారులు తెలిపారు.ప్రజలందరూ రహదారి భద్రతా నియమాలను పాటిస్తూ, మైనర్ డ్రైవింగ్‌ను పూర్తిగా నిరోధించడంలో పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.