తొలి శుభోదయం ఒంగోలు :-
ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, జిల్లాలో విజిబుల్ పోలీసింగ్‌లో భాగంగా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్ డ్రైవింగ్‌పై ప్రత్యేక తనిఖీలు నిర్వహించడమైంది. ఈ తనిఖీల్లో ట్రాఫిక్ పీఎస్ ఆర్ఎస్ఐ శివ ప్రసాద్ గారు మైనర్ డ్రైవింగ్ చేస్తూ వాహనాలు నడుపుతున్న పలువురిని గుర్తించారు.ఈ సందర్భంగా మైనర్ డ్రైవింగ్‌లో పట్టుబడిన వాహనదారులకు మరియు వారి తల్లిదండ్రులకు రోడ్ సేఫ్టీపై కౌన్సెలింగ్ నిర్వహించి, చట్టపరమైన నిబంధనలను వివరించారు. మైనర్ డ్రైవింగ్ చేయడం చట్టవిరుద్ధమేగాక ప్రాణాలకు ముప్పుగా మారుతుందని, చిన్న వయసులో వాహనాలు నడపడం వల్ల తీవ్ర రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని హెచ్చరించారు.తల్లిదండ్రులు తమ పిల్లలకు వాహనాలు ఇవ్వకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. ప్రజల భద్రతే ప్రధాన లక్ష్యంగా ట్రాఫిక్ నిబంధనల అమలు నిరంతరం కొనసాగుతుందని, మైనర్ డ్రైవింగ్‌పై ఎలాంటి ఉపేక్ష లేకుండా కఠిన చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్ పోలీసులు స్పష్టం చేశారు.