తొలి శుభోదయం:-
మొంథా తుఫాన్ కారణంగా ప్రకాశం జిల్లాలో పలు ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగిపోర్లుతున్న నేపథ్యంలో ప్రజల భద్రతను కాపాడేందుకు ప్రకాశం జిల్లా పోలీసులు క్షేత్రస్థాయిలో బందోబస్తు నిర్వహిస్తున్నారు.వర్షాల ప్రభావం ఎక్కువగా ఉన్న గ్రామీణ ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాలు, సప్టాలు, వాగులు దాటే మార్గాల వద్ద సిబ్బంది నిత్యం పహారా కాస్తూ, ప్రజలు ప్రమాదకర ప్రాంతాలకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.ఎటువంటి అత్యవసర పరిస్థితి తలెత్తినా తక్షణ స్పందన ఇవ్వడానికి పోలీసులు, రేవెన్యూ, అగ్నిమాపక మరియు ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు సమన్వయంతో పనిచేస్తున్నాయి.జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్ మార్గదర్శకత్వంలో ప్రజల ప్రాణ, ఆస్తి రక్షణ కోసం అన్ని శాఖలు పూర్తిగా సిద్ధంగా ఉన్నాయని అధికారులు తెలిపారు.ప్రజలు అవసరం లేని సందర్భాల్లో బయటకు వెళ్లకూడదని, వాగులు, సప్టాల వద్దకు వెళ్లరాదని పోలీసులు విజ్ఞప్తి చేశారు.