తొలి శుభోదయం ప్రకాశం:-
ప్రకాశం జిల్లాలో మొంథా తుఫాన్ ప్రభావం నేపథ్యంలో ప్రజల భద్రత, ఆస్తుల రక్షణ, అత్యవసర పరిస్థితులపై స్పందన చర్యల కోసం ప్రకాశం జిల్లా పోలీసులు అన్ని శాఖల సమన్వయంతో విస్తృత బందోబస్తు చర్యలు చేపట్టారు.
జిల్లాలోని తీరప్రాంతాలు, లోతట్టు ప్రాంతాలు, వాగులు–వంకలు, రహదారులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయబడింది. డ్రోన్ కెమెరాల ద్వారా పర్యవేక్షణ, కీలక ప్రాంతాల్లో పెట్రోలింగ్ బృందాలు, అలాగే రహదారి రవాణా సాఫీగా కొనసాగేందుకు ట్రాఫిక్ నియంత్రణ బృందాలు విధుల్లో ఉన్నాయి.
ప్రజలకు ఏవైనా అత్యవసర పరిస్థితులు తలెత్తినప్పుడు వెంటనే 100 లేదా స్థానిక పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని సూచించారు.
తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో రాత్రి వేళల్లో బయటకు వెళ్లరాదు, విద్యుత్ తీగలు, చెట్లు కూలిన ప్రదేశాలకు దూరంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
జిల్లా ఎస్పీ మార్గదర్శకత్వంలో పోలీసులు, రేవెన్యూ, అగ్నిమాపక, ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు సమన్వయంతో సిద్ధంగా ఉన్నారు.
ప్రజల భద్రతే మా ప్రధాన లక్ష్యం అని ప్రకాశం జిల్లా పోలీసులు పేర్కొన్నారు.
