తొలి శుభోదయం కందుకూరు:-
లింగసముద్రం మండలం మొగిలిచర్ల గ్రామ సచివాలయాన్ని కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అటెండెన్స్ రిజిస్టర్ పరిశీలించి, సిబ్బంది డ్యూటీలను అడిగి తెలుసుకున్నారు. సచివాలయానికి వచ్చిన అర్జీలు, వాటి వివరాలను పరిశీలించారు. సచివాలయ సిబ్బంది, ప్రజలకు జవాబుదారీగా పనిచేయాలని ఎమ్మెల్యే నాగేశ్వరరావు వారికి సూచించారు. పనుల కోసం ప్రజలను పదేపదే తిప్పుకోకుండా, వాటి పరిష్కారాల గురించి బాధ్యతగా పనిచేయాలని అన్నారు. సిబ్బంది నిర్లక్ష్యంపై ప్రజల నుంచి చిన్న ఫిర్యాదు వచ్చినా చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇంకా సచివాలయ పరిధిలో అమలవుతున్న పథకాలు, పెండింగ్ అర్జీలపై సిబ్బందితో చర్చించారు.