తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం :-

ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, గుడ్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని మొగుల్లూరు గ్రామంలో గల కేజీబీవీ (KGBV) పాఠశాలను పోలీసులు సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థినులతో ముఖాముఖి నిర్వహించి మహిళా భద్రత, సైబర్ క్రైమ్ మరియు శక్తి యాప్ వినియోగంపై అవగాహన కల్పించారు.సమావేశంలో పోలీసులు మాట్లాడుతూ.. ప్రస్తుత డిజిటల్ యుగంలో సోషల్ మీడియా పట్ల అప్రమత్తంగా ఉండాలని, గుర్తుతెలియని వ్యక్తులతో వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోకూడదని సూచించారు. ఆపద సమయంలో రక్షణ కవచంలా పనిచేసే శక్తి యాప్‌ను ప్రతి విద్యార్థిని మొబైల్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవాలని, అత్యవసర పరిస్థితుల్లో పోలీసులను ఎలా సంప్రదించాలో ప్రత్యక్షంగా వివరించారు. ఈ కార్యక్రమంలో గుడ్లూరు పోలీస్ సిబ్బంది, పాఠశాల ఉపాధ్యాయులు మరియు విద్యార్థినులు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *