తొలి శుభోదయం న్యూస్ దర్శి:-
దర్శి మండలం యర్రఓబనపల్లి గ్రామంలో సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ . గ్రామ ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని చలివేంద్రం ను ప్రారంభించడంతో పాటు అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఘనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రజలకు అవసరమైన ప్రాథమిక సదుపాయాలను అందించడం తన బాధ్యతగా భావిస్తున్నానని, వేసవి కాలంలో శుద్ధమైన తాగునీరు అందించడం ఎంతో ముఖ్యమని తెలిపారు. అలాగే, అన్నదాన కార్యక్రమం ద్వారా ఆకలితో ఉన్న వారికి ఆహారం అందించడం గొప్ప సేవ అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ టిడిపి నాయకులు, స్థానిక ప్రముఖులు, కార్యకర్తలు మరియు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.