తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-

ప్రమాదాల నివారణే లక్ష్యంగా జిల్లా పోలీస్ యంత్రాంగం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పామూరు ఎస్సై వగ్గంపల్లి హైస్కూల్ వద్ద రహదారిపై భద్రతా చర్యలు చేపట్టారు. జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న పాఠశాల కావడంతో, విద్యార్థులు రోడ్డు దాటే సమయంలో ఎటువంటి ప్రమాదాలు జరగకుండా వేగ నియంత్రణ కోసం డ్రమ్ములు మరియు కోన్స్‌ను (Drums & Cones) ఏర్పాటు చేశారు. అతివేగంగా వచ్చే వాహనాలను నియంత్రించడం ద్వారా పాఠశాల విద్యార్థులు మరియు పాదచారుల ప్రాణాలకు రక్షణ కల్పించవచ్చని అధికారులు తెలిపారు. ప్రజల భద్రత దృష్ట్యా వాహనదారులు వేగాన్ని తగ్గించి పోలీసులకు సహకరించాలని ఈ సందర్భంగా కోరారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *