తొలి శుభోదయం ప్రకాశం:-
ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, జిల్లా వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలను నివారించాలనే లక్ష్యంతో అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో అధికారులు, సిబ్బంది కలిసి రాత్రి పహారా విధులను ముమ్మరం చేశారు.
ఈ చర్యల్లో భాగంగా, ప్రకాశం జిల్లా పోలీసులు జాతీయ, రాష్ట్ర రహదారులపై అర్ధరాత్రి 1.00 గంటల నుండి తెల్లవారుజామున 4.30 గంటల వరకు ప్రత్యేకంగా ‘Face Wash & Go’ కార్యక్రమాన్ని అమలు చేశారు.ఈ కార్యక్రమం ద్వారా హైవేలపై ప్రయాణిస్తున్న వాహనాలను ఆపి, డ్రైవర్లు అలసటతో డ్రైవింగ్ చేయకుండా ముఖం కడుక్కోవాలని, కొంత విశ్రాంతి తీసుకుని టీ తాగి తాజాతనంతో ప్రయాణాన్ని కొనసాగించాలని పోలీసులు సూచించారు. అలాగే డ్రైవింగ్ సమయంలో కుటుంబ సభ్యుల భద్రతను గుర్తు పెట్టుకుని బాధ్యతగా వాహనం నడపాలని అవగాహన కల్పించారు.రాత్రివేళ అలసట కారణంగా జరిగే రోడ్డు ప్రమాదాలను నివారించడం, డ్రైవర్ల ప్రాణభద్రతను కాపాడడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యంగా కొనసాగుతోంది. జిల్లా వ్యాప్తంగా ‘Face Wash & Go’ కార్యక్రమం విజయవంతంగా అమలవుతూ ప్రజల మన్ననలు పొందుతోంది అని పోలీసులు తెలిపారు.