తొలి సుభదయం ఒంగోలు:-
రాత్రి వేళల్లో అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా నిరోధించేందుకు ప్రత్యేక డ్రైవ్ ప్రారంభించిన సందర్భంగా, ఒంగోలు డీఎస్పీ శ్రీ రాయపాటి శ్రీనివాసరావు గారు సిబ్బందికి బ్రీఫింగ్ ఇచ్చారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ — ప్రజల భద్రత, శాంతి భద్రత పరిరక్షణ పోలీసుల ప్రధాన బాధ్యత అని, నైట్ బీట్ సమయంలో ప్రతి ప్రాంతాన్ని జాగ్రత్తగా పరిశీలించి అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.అలాగే రాత్రి సమయంలో జరిగే అసాంఘిక కార్యకలాపాలు, గాంబ్లింగ్, గంజాయి విక్రయం, అక్రమ రవాణా వంటి చర్యలను కఠినంగా అరికట్టాలని ఆదేశించారు. ప్రజల సహకారంతో చట్టం మరియు క్రమాన్ని సమర్ధవంతంగా అమలు చేయాలని డీఎస్పీ గారు పిలుపునిచ్చారు.ప్రజల భద్రత కోసం పోలీసు సిబ్బంది నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తారని తెలిపారు.