తొలి శుభోదయం ప్రకాశం:-
ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, పోలీసులు రాత్రి సమయంలో అధిక నేర అవకాశాలు ఉన్న ప్రాంతాలను ప్రత్యేకంగా గుర్తించి కట్టుదిట్టమైన పహారా నిర్వహిస్తున్నారు. రాత్రి బీట్ డ్యూటీలో భాగంగా వాహనాలు, లాడ్జీలు, అనుమానితులు మరియు సంచరించే వ్యక్తులను చెక్ చేస్తూ, ప్రజల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ పోలీసులు నిరంతరం విజిలెంట్‌గా వ్యవహరిస్తున్నారు.FINS సాంకేతికతను వినియోగిస్తూ, అనుమానంగా కనిపించే వ్యక్తుల ఫింగర్ ప్రింట్లను అక్కడికక్కడే స్కాన్ చేసి వారి గత నేర చరిత్రను వెంటనే పరిశీలించగలగడం వల్ల నేర నియంత్రణ మరింత బలపడుతోంది. ఈ సాంకేతికత పోలీసింగ్‌ను వేగవంతం చేస్తూ, నేరస్తులపై చర్యలు మరింత సమర్థవంతంగా తీసుకునేలా సహాయపడుతోంది.రాత్రి పూట కూడా పోలీసులు ప్రజల రక్షణ కోసం 24 గంటలు అలర్ట్‌గా ఉండి, జిల్లాలో శాంతి–భద్రతలు పరిరక్షించడంలో ఎలాంటి రాజీ పడబోమని అధికారులు తెలిపారు. ప్రజలు కూడా అనుమానితుల గమనికపై వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.