తొలి శుభోదయం ప్రకాశం:-
ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, జిల్లాలో శాంతి భద్రతలను మరింత పటిష్టం చేయాలనే ఉద్దేశంతో ప్రకాశం జిల్లా పోలీస్ శాఖ జిల్లావ్యాప్తంగా రాత్రి బీట్‌లో ప్రత్యేక తనిఖీలు నిర్వహించింది.
ఈ తనిఖీలలో భాగంగా పోలీస్ అధికారులు మరియు సిబ్బంది అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేయడంతో పాటు, మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై, అక్రమ కార్యకలాపాలు, చోరీలు మరియు ఇతర నేరాల నివారణపై ప్రత్యేక దృష్టి సారించారు.రాత్రి వేళల్లో ప్రజలు భద్రంగా ఉండేలా అన్ని ప్రాంతాల్లో పోలీస్ బృందాలు అప్రమత్తంగా గస్తీ నిర్వహించాయి. నేరాలను ముందుగానే అడ్డుకునేందుకు, శాంతిభద్రతలు కాపాడేందుకు ఈ రాత్రి బీట్ తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని జిల్లా పోలీస్ అధికారులు తెలిపారు.ప్రజలు పోలీస్ తనిఖీలకు సహకరించాలని, ఏదైనా అనుమానాస్పద సమాచారం ఉంటే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా పోలీస్ అధికారులకు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు.