తొలి శుభోదయం ప్రకాశం:-
ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, రాత్రిపూట నేరాలను అరికట్టేందుకు జిల్లా పోలీసులు నైట్ బీట్ పహారాను మరింత బలోపేతం చేశారు. రాత్రిపూట అనుమానాస్పదంగా సంచరిస్తున్న వ్యక్తులను వేలిముద్ర ఆధారంగా విచారించడం, సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి అక్కడ ప్రత్యేకంగా గస్తీ బృందాలను నియమించడం, నేర కార్యకలాపాలు జరగకుండా నిరంతర పర్యవేక్షణ చేయడం వంటి చర్యలను పోలీసులు కొనసాగిస్తున్నారు.జిల్లాలో శాంతి భద్రతలు కాపాడడంలో భాగంగా ప్రతి పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వహిస్తూ ప్రజల్లో భద్రతాభావాన్ని పెంపొందిస్తున్నారు.