తొలి శుభోదయం సింగరాయకొండ:-
ప్రకాశం జిల్లాలో కొండపి నియోజకవర్గం సింగరాయకొండ మండలం శానంపూడి గ్రామానికి చెందిన రావినూతల జయకుమార్ మంగళవారం సింగరాయకొండ జనసేన పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షులు ఐనాబత్తిన రాజేష్ గారి ఆధ్వర్యంలో కొండపి నియోజకవర్గ సమన్వయకర్త కనపర్తి మనోజ్ కుమార్ చేతుల మీదుగా జనసేన పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది.
జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు సిద్ధాంతాలకు లోబడి పనిచేయాలని దిశ నిర్దేశం చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో జరగబోయే స్థానిక సంస్థల్లో కూటమి ధర్మాన్ని పాటిస్తూ, పార్టీ ఎదుగుదలకి కృషి చేయాలని ప్రజా సమస్యలకు నిరంతరం అండగా ఉండాలని సింగరాయకొండ మండల అధ్యక్షులు ఐనాబత్తిన రాజేష్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సింగరాయకొండ మండల ప్రధాన కార్యదర్శి కాసుల శ్రీను, కనుమళ్ళ సొసైటీ సభ్యులు కూనపురెడ్డి రంగారావు , రావినూతల రాజు పాల్గొన్నారు.