మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి
ఒంగోలులో ఎయిడ్స్ డే అవగాహన ర్యాలీలో పాల్గొన్న మంత్రి డా. స్వామి
తొలి శుభోదయం ప్రకాశం:-
ఎయిడ్స్ పట్ల అవగాహనతోనే ఈ వ్యాధిని సంపూర్ణంగా నిర్మూలించగలమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి అన్నారు. ప్రపంచ ఎయిడ్స్ దినం సందర్భంగా సోమవారం ఉదయం జిల్లా ఎయిడ్స్ నివారణ విభాగ ఆధ్వర్యంలో ఒంగోలులో నిర్వహించిన అవగాహన ర్యాలీలో మంత్రితో పాటు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, కలెక్టర్.పి.రాజాబాబు, స్థానిక ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన రావు, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీ, ఒంగోలు మేయర్ గంగాడ సుజాత పాల్గొన్నారు. సుమారు 700 మందితో ప్రకాశం భవనం వద్ద నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీని అతిథులు జెండా ఊపి, గాలిలోకి బెలూన్లు వదిలి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నివారణ కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల గణనీయంగా కేసులు తగ్గాయి అన్నారు. సమాజం నుంచి ఈ మహమ్మారిని పూర్తిగా నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరిలో అవగాహన కల్పించేలా ప్రత్యేక కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ వ్యాధి సంక్రమణ, వ్యాప్తిపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి సూచించారు.