తొలి శుభోదయం ప్రకాశం:-
ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ఒంగోలు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్ డ్రైవింగ్‌ను నియంత్రించేందుకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా RSI శివప్రసాద్ మైనర్ డ్రైవింగ్ చేస్తూ కనిపించిన విద్యార్థులను మరియు వారి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్ అందించారు.
కౌన్సెలింగ్‌లో RSI మాట్లాడుతూ—లైసెన్స్ లేకుండా వాహనాలు నడపడం చట్టవిరుద్ధమని, మైనర్ డ్రైవింగ్ వల్ల ప్రమాదాలు సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వివరించారు. ట్రాఫిక్ నియమాలను పాటించడం, హెల్మెట్/సీటుబెల్ట్ వాడకం, వేగ పరిమితి వంటి అంశాలపై వారికి స్పష్టమైన అవగాహన కల్పించారు.
తల్లిదండ్రులు తమ పిల్లలకు వాహనాలు ఇవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతూ, రోడ్డు భద్రతను కాపాడేందుకు ఇలాంటి కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయని తెలిపారు.