తొలి శుభోదయం ఉలవపాడు:-
ఉలవపాడు మండలం కే.రాజుపాలెం సమీపంలోని శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రైవేట్ బస్సు ఆటోను వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న ఒక మహిళ అక్కడిక్కడే మృతిచెందగా, మరో ఎనిమిది మందికి స్వల్ప గాయాలు అయ్యాయి.క్షతగాత్రులను వెంటనే ఉలవపాడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. హైదరాబాదు నుంచి నెల్లూరు వెళ్తున్న కావేరి ట్రావెల్స్ బస్సు, కరేడు పంచాయతి టెంకాయ చెట్లపాలెం గ్రామం నుండి కూలీలతో వస్తున్న ఆటోను ఢీకొట్టినట్టు ప్రాథమిక సమాచారం.
పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.