తొలి శుభోదయం ప్రకాశం:-

ప్రకాశం జిల్లా పోలీసులురోడ్డు ప్రమాదాలను నివారించి ప్రజల ప్రాణాలను కాపాడడమే లక్ష్యంగా ప్రకాశం జిల్లా పోలీసులు, రోడ్ సేఫ్టీ వారియర్స్తో కలిసి జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక రోడ్ సేఫ్టీ డ్రైవ్ నిర్వహించారు.ఈ సందర్భంగా ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ తప్పనిసరి వినియోగం, ట్రాఫిక్ నిబంధనల పాటింపు, అధిక వేగం నివారణ, డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్ వాడకంపై అవగాహన కల్పిస్తూ కౌన్సెలింగ్ కార్యక్రమం నిర్వహించారు. నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం వల్ల జరిగే రోడ్డు ప్రమాదాలు, వాటి వల్ల కలిగే ప్రాణ నష్టం గురించి వివరించారు.రైడర్‌తో పాటు పిలియన్ రైడర్ కూడా హెల్మెట్ ధరించడం తప్పనిసరి అని పోలీసులు స్పష్టం చేస్తూ, ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వాహనాలు నడిపి తమతో పాటు ఇతరుల భద్రతకూ సహకరించాలని సూచించారు.రోడ్డు ప్రమాదాల నియంత్రణకు అవగాహన కార్యక్రమాలు, కౌన్సెలింగ్, చట్టపరమైన చర్యలు నిరంతరం కొనసాగుతాయని ప్రకాశం జిల్లా పోలీసులు తెలిపారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *