తొలి శుభోదయం సింగరాయకొండ:-
ప్రకాశం జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో సింగరాయకొండలో రోడ్ సేఫ్టీ వారియర్స్‌తో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించడం, సురక్షిత ప్రయాణంపై అవగాహన పెంపు, ట్రాఫిక్ నియమాల పాటింపు వంటి ముఖ్య అంశాలపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించారు.అనవసర వేగం, ఓవర్‌లోడింగ్, హెల్మెట్ & సీటుబెల్ట్ వినియోగం, పాదచారుల భద్రత వంటి అంశాలను రోడ్ సేఫ్టీ వారియర్స్‌కు వివరిస్తూ, ప్రజలకు అవగాహన చేర్చేలా చర్యలు తీసుకోవాలని పోలీసులు సూచించారు.ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు రోడ్ సేఫ్టీ వారియర్స్‌తో కలిసి భద్రతా చర్యలను మరింత బలోపేతం చేసుకునే దిశగా ప్రణాళికను రూపొందించారు.