తొలి శుభోదయం ప్రకాశం:-

ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, రోడ్డు ప్రమాదాల నివారణ మరియు ప్రజల ప్రాణ భద్రతను కాపాడాలనే లక్ష్యంతో ప్రకాశం జిల్లా పోలీసులు Road Safety Warriorsతో కలిసి జిల్లా వ్యాప్తంగా రోడ్డు భద్రతపై విస్తృత అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ప్రధానంగా హెల్మెట్ ధరించడం, అధిక వేగంతో వాహనం నడపడం వల్ల జరిగే ప్రమాదాలు, ట్రాఫిక్ నియమాల పాటింపు వంటి అంశాలపై ప్రజలకు స్పష్టమైన అవగాహన కల్పించారు. రెండు చక్రాల వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ఓవర్ స్పీడ్‌తో డ్రైవింగ్ చేయడం వల్ల తమతో పాటు ఇతరుల ప్రాణాలకు కూడా ప్రమాదం ఏర్పడుతుందని పోలీసులు వివరించారు.అలాగే, రోడ్డు భద్రతలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని, చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద ప్రమాదాలకు దారితీస్తుందని అధికారులు సూచించారు. రోడ్ సేఫ్టీ వారియర్స్ ప్రజలతో మమేకమై, భద్రతా సూచనలు, ట్రాఫిక్ నియమాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు.ప్రజల భద్రత, సురక్షిత రవాణా వ్యవస్థ ఏర్పాటు లక్ష్యంగా ప్రకాశం జిల్లా పోలీసులు ఇటువంటి అవగాహన కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తారని తెలిపారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *