తొలి శుభోదయం ప్రకాశం:-

ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, మద్దిపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు భద్రత చర్యల్లో భాగంగా ప్రకాశం జిల్లా పోలీసులు జాతీయ రహదారుల అధికారం (NHAI) సిబ్బందితో కలిసి ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆటో డ్రైవర్లు, ద్విచక్ర వాహనదారులకు ట్రాఫిక్ నిబంధనల ప్రాముఖ్యతపై కౌన్సిలింగ్ నిర్వహించి, హెల్మెట్ వినియోగం, అతివేగం నివారణ, లేన్ల క్రమశిక్షణ, వాహన పత్రాల నిర్వహణ వంటి అంశాలపై స్పష్టమైన సూచనలు ఇచ్చారు.ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులపై జరిమానాలు విధించగా, వాటి చెల్లింపులు వాట్సాప్ గవర్నెన్స్ విధానం ద్వారా పూర్తిగా డిజిటల్‌గా స్వీకరించటం జరిగింది.ఈ కార్యక్రమంలో మద్దిపాడు ఎస్‌ఐ , పోలీసు సిబ్బంది మరియు NHAI అధికారులు పాల్గొని, రోడ్డు ప్రమాదాలను తగ్గించడమే లక్ష్యంగా ప్రజల్లో అవగాహన పెంపొందించాల్సిన అవసరాన్ని వివరించారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *