తొలి శుభోదయం ప్రకాశం:-
ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ప్రకాశం జిల్లా పోలీసులు రోడ్ సేఫ్టీ వారియర్స్‌తో కలిసి రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాల్సిన అవసరం, ఓవర్ స్పీడింగ్ వల్ల జరిగే ప్రమాదాలు, ట్రాఫిక్ నియమాల పాటింపు గురించి ప్రజలకు వివరించారు.హెల్మెట్ ధరించడం ప్రాణాలను కాపాడుతుందని, నిర్ణీత వేగ పరిమితిలో వాహనాలు నడపడం ద్వారా ప్రమాదాలను తగ్గించవచ్చని పోలీసులు సూచించారు.ప్రజలు స్వచ్ఛందంగా ట్రాఫిక్ నియమాలు పాటించి, రోడ్డు ప్రమాదాల నివారణకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.