తొలి శుభోదయం ప్రకాశం:-
ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ప్రకాశం జిల్లా పోలీసులు రోడ్డు భద్రత వారియర్స్‌తో కలిసి రోడ్డు భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.పెట్రోలింగ్ సమయంలో ప్రజలకు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించడం వల్ల జరిగే సమస్యలు, రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అలాగే నిర్లక్ష్యంగా నడుచుకునే వాహనదారుల కారణంగా ప్రజలకు కలిగే అసౌకర్యాల గురించి విపులంగా అవగాహన కల్పించారు.ప్రజలు ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించి రోడ్డు ప్రమాదాలను తగ్గించడంలో భాగస్వాములు కావాలని పోలీసులు సూచించారు. రోడ్డు భద్రత కేవలం నిబంధనే కాకుండా, ప్రతి ఒక్కరి బాధ్యత అని అధికారులు పేర్కొన్నారు.