తొలి శుభోదయం ప్రకాశం:-
ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, రోడ్డు ప్రమాదాల నివారణ మరియు ప్రజల ప్రాణ భద్రతను కాపాడాలనే లక్ష్యంతో ప్రకాశం జిల్లా పోలీసులు Road Safety Warriorsతో కలిసి జిల్లా వ్యాప్తంగా కౌన్సెలింగ్ మరియు రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు.ఈ కార్యక్రమాల్లో భాగంగా వాహనదారులు మరియు ప్రజలకు ట్రాఫిక్ నియమాలు పాటించాల్సిన అవసరం, హెల్మెట్ తప్పనిసరిగా ధరించడం, సీట్ బెల్ట్ వినియోగం, ఓవర్ స్పీడ్ వల్ల కలిగే ప్రమాదాలు, మొబైల్ ఫోన్ వాడుతూ డ్రైవింగ్ చేయకూడదనే అంశాలపై విస్తృతంగా అవగాహన కల్పించారు.అలాగే, రోడ్డు పై నిర్లక్ష్యం వల్ల జరిగే ప్రమాదాలు, ప్రజలకు కలిగే ఇబ్బందులు, ప్రాణ నష్టాలపై పోలీసులు మరియు Road Safety Warriors స్పష్టంగా వివరించారు. వాహనదారులతో ప్రత్యక్షంగా మాట్లాడి కౌన్సెలింగ్ అందించడం ద్వారా రోడ్డు భద్రతపై బాధ్యతా భావాన్ని పెంపొందించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యం.ప్రజల భద్రతే లక్ష్యంగా, రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రకాశం జిల్లా పోలీసులు ఇటువంటి అవగాహన కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తారని అధికారులు తెలిపారు.