తొలి శుభోదయం విశాఖపట్నం:
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న కీలక మూడో వన్డేలో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ కీలక మైలురాయిని చేరుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 20,000 పరుగులు చేసిన నాలుగో భారత ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. కేశవ్ మహరాజ్ వేసిన 14 ఓవర్‌లో నాలుగో బంతికి రోహిత్ సింగిల్ తీసి ఈ ఘనత సాధించాడు. వన్డేల్లో 11,468, టెస్టుల్లో 4301, టీ20ల్లో 4231 పరుగులు చేశాడు. అంతకుముందు సచిన్ (34357), కోహ్లీ (27910), ద్రవిడ్ (24208) ఈ ఫీట్ సాధించారు.