తొలి శుభోదయం కందుకూరు:-
వలేటివారిపాలెం మండలం మాలకొండపై వెలసిన శ్రీ మాల్యాద్రి లక్ష్మీ నరసింహస్వామిని కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు శనివారం దర్శించుకున్నారు. నియోజకవర్గ ప్రజలను చల్లగా చూడాలంటూ స్వామి, అమ్మవార్లకు ప్రత్యేకపూజలు చేశారు. అంతకుముందు పండితులు, అధికారులు నాగేశ్వరరావు కి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం ప్రధానంగా అన్నప్రసాదం తయారీ కేంద్రాన్ని ఎమ్మెల్యే తనిఖీ చేసి పదార్థాల నాణ్యత పరిశీలించారు. రుచి, శుచిగా ఉండేలా పదార్థాలు తయారు చేయాలని, వచ్చిన భక్తులందరికీ అన్న ప్రసాదం అందేలా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు పదేపదే సూచించారు. అన్న ప్రసాద విషయంలో భక్తుల నుంచి ఫిర్యాదులు వస్తే ఊరుకునేది లేదని సుతిమెత్తగా హెచ్చరించారు. క్యూలైన్లో భక్తులతో ఎమ్మెల్యే నాగేశ్వరరావు మాట్లాడుతూ, మాలకొండపై ఏర్పాట్లు ఎలా ఉన్నాయో అడిగి తెలుసుకున్నారు. భక్తుల రద్దీకి తగ్గట్లుగా దర్శన ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. ఇంకా కొండపై పలు ప్రాంతాలను ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో చంద్రశేఖర్, నేటి వారి పల్లి మండల పార్టీ అధ్యక్షులు మాదాల లక్ష్మీ నరసింహం, పార్టీ నాయకులు కాకుమాని హర్ష, ప్రగడ శ్రీనివాసులు, కామినేని అశోక్, ప్రగడ మోహన్ మరియు ఆలయ సిబ్బంది ఇతరులు పాల్గొన్నారు.
