చట్ట వ్యతిరేక/అసాంఘిక కార్యకలాపాలకు తావిస్తే చట్టపరమైన చర్యలు తప్పవు

తొలి శుభోదయం ప్రకాశం :-

శాంతి భద్రతల పరిరక్షణ, నేర నియంత్రణ, చట్ట విరుద్ధ కార్యకలాపాలను అరికట్టడమే లక్ష్యంగా జిల్లా ఎస్పీ శ్రీ వి.హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్ గారి ఆదేశాలతో ఒంగోలు నగరంలోని స్ధానిక పోలీసు సిబ్బందితోపాటు స్పెషల్ పార్టీ సిబ్బందితో హోటల్స్, లాడ్జిలు తనిఖీలు నిర్వహించారు.ఒంగోలులోని లాడ్జిలను, హోటల్స్ రూమ్స్ ను పోలీసులు ప్రతీ గదిని క్షుణ్ణంగా తనిఖీ చేసి, లాడ్జిలలో బస చేసిన వ్యక్తల వివారాలను పరిశీలించి, కొత్త వ్యక్తులను ప్రశ్నిస్తూ వివరాలపై ఆరా తీశారు.
లాడ్జిలలోని కంప్యూటర్ లో ఇతర ప్రాంతాల నుండి వస్తున్న వారి వివరాలు ఎప్పటికప్పుడు నమోదు చేయాలని సూచించారు.లాడ్జిలలో బస చేసిన వ్యక్తుల యొక్క చేసిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా అనుమానాస్పద వ్యక్తుల వివరాలు సేకరించి వారి యొక్క వేలిముద్రలను ఫింగర్ ప్రింట్స్ ఐడెంటిఫికేషన్ ద్వారా తనిఖీ చేసి నేర నియంత్రణకు జిల్లా పోలీసులు పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు. హోటల్ రూమ్స్, లాడ్జీలలో బస చేసే వ్యక్తుల ఐడి కార్డులను పరిశీలించి, సంబంధించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆధార్ కార్డులు, ఇతర వివరాల కోసం సరైన రిజిస్టర్ నిర్వహించాలని నిర్వహకులకు సూచించారు. బస చేసే వ్యక్తుల రికార్డ్ మెయింటెనెన్స్ చేయని పక్షంలో చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
చట్టవిరుద్ధంగా ఎవరికీ గదులు ఇవ్వరాదని, అనుమానాస్పద వ్యక్తులు లాడ్జిల్లో బస చేసిన సమయంలో పోలీసులకు సమాచారం ఇవ్వాలని, ఎలాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు తావిచ్చినా చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *