తొలి శుభోదయం ఉలవపాడు:-

వందేమాతర గీతం 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంలో, దేశ ఐక్యతను చాటుతూ CISF జవాన్లు చేపట్టిన కోస్టల్ సైక్లోథాన్ మన ఉలవపాడుకు చేరుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ రోజు 130 మంది CISF జవాన్లకు స్థానిక నాయకులు, ప్రజలు మరియు విద్యార్థులతో కలిసి ఘన స్వాగతం పలకడం జరిగింది.దేశంలోని తీర ప్రాంతాలన్నింటినీ కలుపుతూ సుమారు 6,500 కిలోమీటర్ల మేర సైకిల్ యాత్ర చేయడం నిజంగా సాహసోపేతం. వారి దీక్షకు, దేశభక్తికి నా హృదయపూర్వక అభినందనలు.గతంలో సముద్ర మార్గం ద్వారా ఉగ్రవాదులు ముంబైలోకి చొరబడి చేసిన మారణహోమాన్ని మనం మరువలేం. అటువంటి ఘటనలు పునరావృతం కాకుండా, దేశ భద్రత విషయంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. తీర ప్రాంత పరిరక్షణలో CISF పాత్ర ఎంతో కీలకం.మనమందరం ఇళ్లలో ప్రశాంతంగా జీవిస్తున్నామంటే అది సరిహద్దుల్లో, తీర ప్రాంతాల్లో మన సైనికులు చేస్తున్న త్యాగాల ఫలితమే. నేటి విద్యార్థులు ఈ సైనికులను స్ఫూర్తిగా తీసుకుని, చిన్నప్పటి నుంచే దేశభక్తిని పెంపొందించుకోవాలని, దేశ సేవలో భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాను.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *