తొలి శుభోదయం న్యూస్ టంగుటూరు :-

గొప్ప గొప్ప నాయకులు అత్యున్నత స్థానాల్లో ఉన్నవారు, సీఈఓ, లు సంఘసంస్కర్తలు అందరూ మంచి వక్తలే. సమాజంలో ఉన్నత స్థానాల్లో ఎదగటానికి విద్యతోపాటు భావవ్యక్తీకరణ నైపుణ్యాలు ఇతరులను నొప్పించక మాట్లాడేవారు ఉన్నత స్థాయికి ఎదుగుతారు.ప్రకాశం జిల్లా జనవిజ్ఞాన వేదిక శాఖ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈనెల 21వ తేదీ జిల్లాస్థాయిలో ఒంగోలు పేజీ ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన వక్తా పోటీలలో సింగరాయకొండ గ్రామానికి చెందిన సామాన్య రైతు కుటుంబానికి చెందిన షేక్ తహసీన్ ఒంగోలు రైస్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ చదువుతున్నది. మంచి విషయ పరిజ్ఞానంతోనూ, సమయపాలనతోను చక్కగా రాణించి జిల్లా స్థాయిలో ప్రథమ బహుమతి సాధించింది. ప్రథమ స్థానంలో గెలుపొందిన ఈ బీటెక్ విద్యార్థినిని జనవిజ్ఞాన వేదిక ప్రకాశం జిల్లా శాఖ ఈనెల 28వ తేదీ గుంటూరులో కీట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో జరుగు రాష్ట్రస్థాయి పోటీలకు పంపుచున్నది. ప్రశ్నించే తత్వం శాస్త్రీయ దృక్పథాన్ని విద్యార్థులలో పెంచటానికి జనవిజ్ఞాన వేదిక ఈ వక్తా కార్యక్రమం చేపట్టినదని ప్రకాశం జిల్లా శాఖ అధ్యక్షులు చిగురుపాటి చిన్నాజీ అలాగే వేదిక శాఖ రాష్ట్ర బాధ్యులు డాక్టర్ కొల్లా నాగేశ్వరరావు తెలియజేశారు. సామాన్య రైతు కుటుంబానికి చెందిన ఈ విద్యార్థిని జనవిజ్ఞాన వేదిక ప్రకాశం జిల్లా శాఖ నిర్వహించిన జిల్లా స్థాయిలో ప్రథమ బహుమతి సాధించటం సింగరాయకొండ గ్రామానికి గర్వకారణమని గ్రామస్తులు అభిప్రాయపడుతున్నారు. అలాగే ఈ విద్యార్థిని రాష్ట్రస్థాయిలో కూడా మంచి బహుమతి సాధించాలని జనవిజ్ఞాన వేదిక ప్రకాశం జిల్లా శాఖ అధ్యక్షులు చిగురుపాటి చిన్నాజీ అలాగే కంచర్ల వెంకటేశ్వర్లు మధు ఈ విద్యార్థినికి శుభాకాంక్షలు తెలియజేశారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *