తొలి శుభోదయం న్యూస్ కనిగిరి:-
జన విజ్ఞాన వేదిక నిర్వహించిన వక్త 2026 కార్యక్రమంలో కనిగిరి మండల స్థాయిలో 2వ మరియు 3వ స్థానాలలో KTR టెక్నో స్కూల్ విద్యార్థునులు అయిన అశ్విని మరియు భార్గవి లు నిలిచారు. ఈ సందర్భంగా స్కూల్ చైర్మన్ కుందురు తిరుపతి రెడ్డి బహుమతులు పొందిన విద్యార్థులను అభినందించారు. కేవలం చదువులోనే కాకుండా ఇటువంటి పోటీలలో కూడా తమ విద్యార్థులు ముందుండడం ఎంతో ఆనందాన్నిచ్చిందని ఆయన అన్నారు. విద్యార్థులను అన్ని రంగాలలో ముందుకు నడిపించడంలో ఎప్పుడూ KTR స్కూల్ ముందంజలోనే ఉంటుందని స్కూలు ప్రిన్సిపల్ నారాయణ గారు అన్నారు. ఈ సందర్భంగా విజేతలకు స్కూలు ఉపాధ్యాయ బృందం అభినందనలు తెలియజేసారు.