తొలి శుభోదయం:-
సింగరాయకొండ సీఐ హాజరత్తయ్య జరుగుమల్లి పోలీస్ స్టేషన్‌ను సందర్శించి, వర్షాల కారణంగా సంభవించవచ్చే ప్రమాదాల నివారణకు సంబంధించి సిబ్బందికి తగిన సూచనలు అందించారు.ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, ముఖ్యంగా వర్షాల కారణంగా జారుడు రహదారులు, వాగులు, చెరువులు మరియు లోతట్టు ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు సహాయం అందించేందుకు సమయానుకూల చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు.