తొలి శుభోదయం న్యూస్ టంగుటూరు :-
వల్లూరులో నిర్వహించిన ‘జల ధార – జల హారతి’ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డా. డోలా శ్రీబాలవీరాంజనేయ స్వామి గారితో జిల్లా కలెక్టర్ శ్రీ పి. రాజాబాబు గారు కలిసి పాల్గొనడం జరిగింది.కలెక్టర్ గారు “జలమే జీవనాధారమని, నీటి వనరుల సంరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. ఈ క్రమంలో చెరువుల పూడికతీత, మరమ్మతులు, మొక్కల నాటకం వంటి పనులను 100 రోజుల ప్రత్యేక ప్రణాళికలో భాగంగా వేగవంతంగా చేపడుతున్నామని, ఈ చర్యల ద్వారా భూగర్భ జల మట్టం పెంపు, సాగునీటి సౌకర్యాల విస్తరణ, రైతులపై ఆర్థిక భారం తగ్గించడం లక్ష్యంగా పనిచేస్తున్నామని సూచించారు.అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి, నీటి వనరుల అభివృద్ధి పనులను సమయానికి పూర్తి చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. జల సంరక్షణలో ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకం. ప్రతి ఒక్కరూ నీటిని ఆదా చేసి భవిష్యత్ తరాలకు భద్రపరచాలి.