తొలి శుభోదయం :-
ప్రకాశం జిల్లా పోలీసులు విద్యార్థిని విద్యార్థులలో సైబర్ మోసాలపై అవగాహన పెంచేందుకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా డిజిటల్ అరెస్ట్‌లు, APK లింక్ మోసాలు, ఆన్‌లైన్ ఉద్యోగ మోసాలు, స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ స్కామ్‌లు, క్రిప్టోకరెన్సీ మోసాలు వంటి వివిధ రకాల సైబర్ నేరాల గురించి విద్యార్థులకు వివరించారు.విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద లింకులు క్లిక్ చేయకూడదని, వ్యక్తిగత వివరాలు లేదా OTP ఎవరికీ ఇవ్వకూడదని సూచించారు.సైబర్ మోసాలకు గురైన వెంటనే www.cybercrime.gov.in లేదా 1930 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని పోలీసు అధికారులు సూచించారు