తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-

పదో తరగతి పబ్లిక్ పరీక్షలు–2026 నేపథ్యంలో ప్రకాశం మరియు మార్కాపురం జిల్లా పోలీసులు పూర్తి అప్రమత్తతతో పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట భద్రతా ఏర్పాట్లు అమలు చేస్తున్నారు. జిల్లా ఎస్పీ గారి మార్గదర్శకత్వంలో ప్రతి కేంద్రం వద్ద ప్రత్యేక బందోబస్త్, నిరంతర నిఘా, ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టారు.విద్యార్థులు ఎటువంటి భయాందోళనలు లేకుండా ప్రశాంతంగా పరీక్షలు రాసేలా అనుకూల వాతావరణం కల్పించడం ప్రధాన లక్ష్యంగా పోలీసులు కృషి చేస్తున్నారు. అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచుతూ, పరీక్షా సమయాల్లో ట్రాఫిక్ రద్దీ తగ్గించే చర్యలు అమలు చేస్తున్నారు.“విజిబుల్ పోలీసింగ్” ద్వారా పోలీసుల నిరంతర ఉనికి స్పష్టంగా కనిపించేలా చర్యలు తీసుకుని, విద్యార్థులు మరియు తల్లిదండ్రుల్లో భద్రతా భావనను పెంచుతున్నారు. అన్ని విభాగాల సమన్వయంతో పరీక్షల నిర్వహణలో ఎటువంటి అంతరాయం కలగకుండా చర్యలు చేపడుతున్నారు.పరీక్షల సమయంలో ప్రశాంత వాతావరణం కొనసాగించేందుకు ప్రజలు కూడా సహకరించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *