తొలి శుభోదయం ప్రకాశం:-
ప్రతిఒక్కరు చదువుకొని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఎంతో కస్టపడి రాజ్యాంగంను రచించిన మేధావి అంబేద్కర్ అని ఒంగోలు డివిజన్ ఉప విద్యాశాఖాధికారి యన్ చంద్రమౌలేశ్వరరావు అన్నారు. గురువారం నాడు ఉప విద్యాశాఖాధికారి కార్యాలయంలో ఈనెల 6 వతేది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 69 వ వర్ధంతి సందర్బంగా మాస్ ఆర్గనైజేషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వ్యాసరచన పోటీలకు సంబందించిన బ్రోచర్ ను ఆయన ఆవిష్కరించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నేడు విద్యార్థులలో ఉన్న పోటీతత్వన్ని వెలికితీసి తద్వారా వారిలో ఉన్న ప్రతిభ గుర్తించి ప్రోత్సహించె విధంగా విద్య మరియు సమాజంపై అంబేద్కర్ ఆలోచన విధానం అనే అంశం మీద మాస్ ఆర్గనైజేషన్ సంస్థ వారు వ్యాసరచన నిర్వహించడం అభినందనీయం అని కొనియాడారు. మాస్ ఆర్గనైజేషన్ అధ్యక్షులు జి. శివాజీ మాట్లాడుతు అంబేద్కర్ గారి ఆలోచనలను ఆశయాలను ప్రతిఒకరికి తెలియాలనే ఉద్దేశ్యంతో ఈ పోటీలు నిర్వహిస్తున్నామని ఈ పోటీలు తమ తమ పాఠశాలలలోనే నిర్వహించడం జరుగుతుందని పోటీలో పాల్గొన్న వారి పేపర్లను జంబ్లీంగ్ విధానంలో మొదటి మూడు బహుమతులు ప్రకటిస్తామని ప్రతి పాఠశాల యాజమాన్యం వారు సహకరించగలరని కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఎడిటర్స్ అండ్ జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్షులు మేకపాటి మాల్యాద్రి,బొడ్డు శ్రీనివాసరావు, పట్రా జోసెఫ్ తదితరులు పాల్గొన్నారు.