తొలి శుభోదయం ప్రకాశం:-
సాంఘిక సంక్షేమ శాఖ బాలుర వసతి గృహం కొనకనమిట్ల లోని విద్యార్ధులు ఆదివారం ఉదయం ఆల్ఫాహారం, మధ్యాహ్యభోజనం లేక ఆకలితో విలవిలలాడి చివరకు తల్లిదండ్రులతో ఇంటికి వెళ్ళిపోయిన సంఘటన పైన విచారణ జరపవలసినదిగా శ్రీయుత జిల్లా కలెక్టర్ అండ్ మేజిస్ట్రేట్ వారు ఆదేశించటం జరిగినది. విచారణం నివేదిక లో సంబంధిత వసతి గృహ సంక్షేమాధికారి పర్యవేక్షణ లోపం వలన విద్యార్ధులకు సకాలంలో భోజనం అందించకపోవటం వలన సంబంధిత వసతి గృహ సంక్షేమాధికారిని మరియు కామాటిని సస్పెండ్ చేస్తూ గౌరవ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేయటం జరిగినది. కావున జిల్లా లోని అందరు సహాయ సాంఘిక సంక్షేమాధికారులు, వసతి గృహ సంక్షేమాధికారులు మరియు నాల్గవ తరగతి సిబ్బంది తమ తమ విధుల పట్ల అత్యంత బాధ్యతతో వ్యవహరించి, విద్యార్థుల సంక్షేమం, భోజన ఏర్పాట్లు, పరిశుభ్రత మరియు రోజువారీ పర్యవేక్షణ విధులను సమయానికి, విధి ప్రమాణాలకు అనుగుణంగా నిర్వహించవలసినదిగా ఆదేశించుచూ మరియు విధుల పట్ల నిర్లక్ష్యం ప్రదర్శించిన సందర్భంలో కఠిన చర్యలు తీసుకుంటామని డిప్యూటీ డైరెక్టర్ ఎన్. లక్ష్మా నాయక్ పత్రికా ముఖంగా తెలియజేశారు.