తొలి శుభోదయం ఒంగోలు:-
విపత్తు నిర్వహణలో జిల్లా యంత్రాంగం చూపిన ప్రతిభను చాటుతూ రూపొందించిన ‘మొంథా తుఫాన్ డిజాస్టర్ మేనేజ్మెంట్ మాన్యువల్‌ను’ ప్రకాశం జిల్లా కలెక్టర్ పి. రాజబాబు , మంత్రి డాక్టర్ డోలా శ్రీబాలవీరాంజనేయ స్వామి మరియు స్థానిక శాసనసభ్యులతో కలిసి ప్రకాశం భవనంలో ఆవిష్కరించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు జియో కోఆర్డినేట్స్, ఫొటోలు మరియు క్షేత్రస్థాయి అనుభవాలను క్రోడీకరించి రూపొందించిన ఈ మాన్యువల్ భవిష్యత్తులో విపత్తులను సమర్థంగా ఎదుర్కోవడానికి ఒక మార్గదర్శిగా నిలుస్తుందని వారు పేర్కొన్నారు. ప్రాణనష్టం జరగకుండా అధికారులు, సిబ్బంది చూపిన అంకితభావం మరియు సమన్వయానికి గుర్తింపుగా ఈ సందర్భంగా వారిని ఘనంగా సన్మానించారు.