వెంకటాచలం, అక్టోబర్ 13:మాజీ ముఖ్యమంత్రివర్యులు వై.యస్.జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు, మాజీ మంత్రివర్యులు మరి ఉమ్మడి నెల్లూరు జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డా౹౹ కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా,వెంకటాచలం మండల కేంద్రంలో ప్రజల ప్రాణాలు తీస్తున్న కల్తీ మద్యాన్ని అరికట్టాలంటూ, భారీ ర్యాలీ నిర్వహించి, తహశీల్దార్ కి వినతి పత్రం అందజేసిన సర్వేపల్లి నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు.భారీగా తరలివచ్చిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు,ప్రజలు.ఈ సందర్భంగా కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ…….వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు, వైయస్సార్ పార్టీ జిల్లా అధ్యక్షులు కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆదేశాలతో సర్వేపల్లి నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గ్రామాల్లో బెల్టు షాపులు తొలగించాలని, నకిలీ మద్యంపై విచారణ జరిపించాలని వెంకటాచలం తహశీల్దార్ కి వినతి పత్రం అందించాం అని అన్నారు.
కూటమి ప్రభుత్వంలో గ్రామాల్లో ఎక్కడ చూసినా విచ్చలవిడిగా బెల్టు షాపులు నడుపుతున్నారు అని అన్నారు.గ్రామాల్లో బాహాటంగా బెల్టు షాపులు నిర్వహిస్తున్నా, ప్రభుత్వ చర్యలు శూన్యం అని అన్నారు.
రాత్రి పగలు తేడా లేకుండా, 24 గంటలు బెల్టు షాపుల ద్వారా మద్యం అమ్మకాలు నిర్వహిస్తున్నారు అని అన్నారు.
కూటమి ప్రభుత్వంలో నీళ్లు దొరకని గ్రామాల్లో కూడా, మద్యం దొరుకుతుంది అని అన్నారు.జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో నియమ నిబంధనల ప్రకారం ప్రభుత్వ ఆధ్వర్యంలో మద్యం షాపులు నిర్వహించబడ్డాయి అని అన్నారు.ప్రజల ప్రాణాలను సైతం లెక్కచేయకుండా, ఆదాయమే లక్ష్యంగా, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మద్యం పాలసీని తీసుకుని వచ్చింది అని అన్నారు.కూటమి ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న తెలుగుదేశం నాయకులే నకిలీ మద్యం తయారీలో భాగస్వాములుగా ఉన్నారు అని అన్నారు.నకిలీ మద్యం కారణంగా ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతుంది అని అన్నారు.బెల్టు షాపుల్లో నకిలీ మద్యం అమ్మకాలు జరుపుతూ, కూటమి నేతలు భారీ దోపిడీకి పాల్పడుతున్నారు అని అన్నారు.కూటమి ప్రభుత్వంలో నకిలీ మద్యాన్ని కుటీర పరిశ్రమగా  గ్రామ, గ్రామాన స్థాపించుకొని, నకిలీ మద్యాన్ని తయారు చేస్తూ, పేద ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు అని అన్నారు.
కూటమి ప్రభుత్వపు వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు జగన్మోహన్ రెడ్డి పై నిందలు వేయడం దారుణం అని అన్నారు.
కూటమి నేతలే నకిలీ మద్యం తయారీలో సూత్రధారులుగా, పాత్రధారులుగా ఉన్నారు అని అన్నారు.ప్రజల ప్రాణాలు తీస్తున్న నకిలీ మద్యం కుంభకోణంపై ప్రభుత్వం పారదర్శకంగా విచారణ చేపట్టాలి అని అన్నారు.కూటమి ప్రభుత్వానికి ప్రజలపై సిద్ధ శుద్ధి ఉంటే గ్రామాల్లో కుటుంబాలను రోడ్డుపాలు చేస్తున్న బెల్టు షాపులను నియంత్రించాలి అని అన్నారు.నకిలీ మద్యం కుంభకోణం పై సిబిఐ విచారణ జరిపించాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం అని అన్నారు.
గ్రామాల్లో పూర్తిస్థాయిలో బెల్టు షాపులను తొలగించాలని, నకిలీ మద్యం అమ్మకాలను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నాం అని అన్నారు.రాష్ట్రంలో నకిలీ మద్యం అంతమయ్యేంతవరకు జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోరాటం కొనసాగిస్తాం అని అన్నారు. మా నాయకులు కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో నకిలీ మద్యంపై ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాం అని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *