తొలి శుభోదయం ప్రకాశం పోలీస్:-

వెలిగండ్ల మండలం చోడవరం గ్రామ పరిధిలోని పొలాల్లో అక్రమంగా జూదం ఆడుతున్న నలుగురు వ్యక్తులను పోలీసులు పట్టుకుని, వారి వద్ద నుంచి నగదును స్వాధీనపరచుకున్నారు.ప్రకాశం జిల్లా ఎస్పీ సూచనల మేరకు, జిల్లా వ్యాప్తంగా పేకాట శిబిరాలు మరియు ఇతర చట్టవిరుద్ధ కార్యకలాపాలపై ప్రకాశం జిల్లా పోలీస్ అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ ఆకస్మిక తనిఖీలు, దాడులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో వెలిగండ్ల పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా జూదం నిర్వహిస్తున్న వారిని గుర్తించి చట్టప్రకారం చర్యలు చేపట్టారు.సామాజిక శాంతి భద్రతలకు భంగం కలిగించే జూదం వంటి అక్రమ కార్యకలాపాలపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు స్పష్టం చేశారు. ఇలాంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు సంబంధించి ప్రజలకు ఏవైనా సమాచారం ఉన్నట్లయితే వెంటనే డయల్ 100 ద్వారా పోలీసులకు తెలియజేయాలని సూచించారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *