తొలి శుభోదయం ప్రకాశం:-
ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, దర్శి డీఎస్పీ మరియు పోలీసు సిబ్బంది కలిసి వెల్లంపల్లి గ్రామంలో ప్రజలకు ట్రాఫిక్ నిబంధనలు మరియు రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా హెల్మెట్ వినియోగం, సీట్‌బెల్ట్ ధరించడం, అధిక వేగం, మద్యం సేవించి వాహనం నడపడం వల్ల కలిగే ప్రమాదాలపై ప్రజలకు వివరించారు.
రోడ్డు ప్రమాదాలను తగ్గించి ప్రజల ప్రాణ భద్రతను కాపాడాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమం నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. ప్రజలు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ప్రకాశం జిల్లా పోలీసులు కోరారు.