తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:-
మార్కాపురం జిల్లా కేంద్రంలోని దోర్నాల బస్టాండ్ దగ్గర మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు గుంటక సుబ్బారెడ్డి అధ్యక్షతన దాతల సహకారంతో మంచినీటి చలివేంద్రాన్ని ఏర్పాటు చేయగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవస్థానం ఈవో గోలమారి శ్రీనివాస్ రెడ్డి, వివేకానంద విద్యాపీఠం అధ్యక్షులు పేరం పెద్ద సత్యనారాయణ, శ్రీమతిగుంటక వనజాక్షి చెన్నారెడ్డి హాజరై రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. గత కొన్ని సంవత్సరాలుగా మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున ఎన్నో మంచి పనులు చేస్తుందని అదేవిధంగా నేడు చలివేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమం ఉద్దేశించి సేవా సంస్థ అధ్యక్షులు గుంటక సుబ్బారెడ్డి మాట్లాడుతూ మార్కాపురం పట్టణ ప్రజలకు గ్రామ ప్రజలందరికీ శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవస్థానం తిరుణాల సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎండాకాలంలో చలివేంద్రం ఏర్పాటు చేయడం మన సంస్కృతిలో ఒక గొప్ప సేవా కార్యక్రమం. ఈ కాలంలో తీవ్ర ఎండల వల్ల ప్రజలు, ముఖ్యంగా ప్రయాణికులు, కూలీలు, పేదవారు ఎక్కువగా ఇబ్బందులు పడుతుంటారు. అలాంటి సమయంలో చలివేంద్రం ద్వారా చల్లని తాగునీరు, మజ్జిగ, పానకాలు అందించడం వాళ్లకు ఎంతో ఉపశమనం కలిగిస్తుంది.
చలివేంద్రం ఏర్పాటు చేయడం అనేది కేవలం దాహం తీర్చడం మాత్రమే కాదు, మన మనసులోని మానవత్వాన్ని, దయాగుణాన్ని బయటపెట్టే ఒక మంచి అవకాశం కూడా. చిన్న సహాయం అయినా, అది ఒకరి ప్రాణాలకు ఉపశమనం ఇవ్వగలదు. అందుకే ప్రతి ఒక్కరూ తమ వంతుగా చలివేంద్రాల ఏర్పాటులో పాల్గొనాలి.
మన గ్రామం, మన ప్రాంతం చల్లగా ఉండాలంటే మన హృదయాలు కూడా చల్లగా ఉండాలి. ఈ ఎండాకాలంలో చలివేంద్రాలు ఏర్పాటు చేసి సేవా భావాన్ని చాటుదాం. ఈ కార్యక్రమంలో కోశాధికారి తడికమల్లశ్రీనివాసులు,అనుమల ఆంజనేయులు, SVL, పి. చెంచయ్య,పి వి కృష్ణారావు, RKG,బచ్చు సుబ్రహ్మణ్యం భీమవరం వెంకటేశ్వర రెడ్డి గంగిశెట్టి కిరణ్,D”మహబూబ్ భాష,చంద్రశేఖర్,మరియు మానవత సభ్యులు మహిళ సభ్యులు పాల్గొన్నారు….