తొలి శుభోదయం జరుగుమల్లి:-
కొండపి నియోజకవర్గం జరుగుమల్లి మండలం ఎడ్లూరుపాడు గ్రామ వాసి ఉండవల్లి రాములు పేద రైతు కుటుంబంలో జన్మించి సాఫ్ట్వేర్ గా అమెరికాకు లో స్థిరపడ్డాడు.ఐతే సంక్రాంతికి సొంతూరు చేరుకున్న ఆయన పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు.తన సొంత నిధులతో యడ్లూరుపాడు నుంచి వెంకటాద్రి పాలెం వరకు 15 లక్షల రూపాయల సొంత నిధులతో మెయిన్ రోడ్డు గ్రావెల్ తో విస్తరణ చేపట్టి మరమ్మతులు చేయించారు. చుట్టుపక్కల గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని,తన గురువు సింహాద్రి మోహన్ దాస్ తనకు స్పూర్తి అన్నారు. అదేవిధంగా కందుకూరు బాలుర ఉన్నత పాఠశాల నందు 5 లక్షల రూపాయల బాస్కెట్బాల్ కోర్టునకు మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రాములు మాట్లాడుతూ తాను అమెరికా వెళ్లి సంపాదించిన దాంట్లో కొంత భాగం సొంత ఊరు అభివృద్ధికి, తాను చదివిన పాఠశాలకు ఖర్చు చేస్తున్నానని తెలిపారు. ఇలా చేయడం తనకు ఎంతో సంతృప్తినిచ్చిందని, ఇవే కాకుండా భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తానని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో వారి మిత్రులు పిడికిటి వెంకటేశ్వర్లు, నాదెండ్ల కోటేశ్వరరావు, బెల్లం వెంకటేశ్వర్లు, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
