తొలి శుభోదయం ప్రకాశం:-

శాంతి భద్రతల పరిరక్షణ, ప్రజా పరిశుభ్రత, అసాంఘిక కార్యకలాపాల నియంత్రణ లక్ష్యంగా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు మార్కాపురం జిల్లా వ్యాప్తంగా బహిరంగ మద్యం సేవన (Open Boozing / Open Drinking) ప్రాంతాల తొలగింపు కార్యక్రమాలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భాగంగా
బేస్తవారిపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని చిట్టి చర్ల రోడ్ ప్రాంతంలో బహిరంగ మద్యం సేవనానికి అడ్డాగా మారిన ప్రాంతాలను శుభ్రపరిచారు.
కొమరోలు పోలీస్ స్టేషన్ పరిధిలోని అయ్యవారిపల్లి గ్రామ రామాలయం సమీపంలో ఓపెన్ డ్రింకింగ్ ప్రాంతాలను గుర్తించి అక్కడ ఉన్న మద్యం సీసాలు, ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించి పరిసరాలను శుభ్రం చేశారు.
మార్కాపురం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వేములకోట గ్రామంలో పంచాయతీ కార్మికులు, స్థానిక ప్రజల సహకారంతో బహిరంగ మద్యం సేవన ప్రాంతాలను పూర్తిగా శుభ్రపరిచి, గ్రామస్తులకు సామాజిక చెడులపై అవగాహన కల్పించారు.
గిద్దలూరు పట్టణం, అలాగే వై. పాలెం గ్రామ పరిధిలో బహిరంగ మద్యం సేవనానికి అడ్డాగా మారిన ప్రాంతాలను గుర్తించి శుభ్రపరిచారు.ఈ సందర్భంగా పోలీస్ అధికారులు మాట్లాడుతూ, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం చట్టవిరుద్ధం అని, ఇటువంటి చర్యలు ప్రజలకు అసౌకర్యం కలిగించడంతో పాటు సామాజిక శాంతికి భంగం కలిగిస్తాయని స్పష్టం చేశారు. మద్యం సేవనంతో కుటుంబాలు విచ్ఛిన్నం కావడం, యువత చెడు మార్గాల్లోకి వెళ్లడం వంటి దుష్పరిణామాలపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు.ప్రజా ప్రదేశాలను శుభ్రంగా, సురక్షితంగా ఉంచడంలో ప్రజలు పోలీసులకు సహకరించాలని, భవిష్యత్తులో కూడా బహిరంగ మద్యం సేవనానికి పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎవరైనా బహిరంగ మద్యం సేవనం లేదా ఇతర అసాంఘిక కార్యకలాపాలపై సమాచారం ఉంటే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా డయల్ 112కు తెలియజేయాలని ప్రజలను కోరారు.ప్రజలు–పోలీసుల సమన్వయంతోనే శుభ్రమైన, సురక్షితమైన మార్కాపురం జిల్లా సాధ్యమని ఈ సందర్భంగా పోలీసులు పేర్కొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *