తొలి శుభోదయం:-
శాంతి భద్రతల పరిరక్షణ, నేరాలు మరియు ట్రాఫిక్ నియంత్రణ లక్ష్యంగా ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు జిల్లా పోలీసులు ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో ప్రధాన రోడ్డు మార్గాలు, రద్దీ ప్రాంతాలు, ముఖ్య కూడళ్ళు, ప్రజలు ఎక్కువగా ఉండే ప్రదేశాలలో విజిబుల్ పోలీసింగ్ నిర్వహించారు.ఈ సందర్భంగా రోడ్డు ప్రమాదాల నివారణకు అవగాహన కల్పించడమే కాకుండా, మోటార్ వాహనాల చట్టం ప్రకారం నిబంధనలు పాటించని వాహనదారులపై కేసులు నమోదు చేశారు. ప్రజలకు, వాహనదారులకు ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూస్తూనే హెల్మెట్/సీటు బెల్టు ధరించకపోవడం, త్రిబుల్ డ్రైవింగ్, ఓవర్ లోడింగ్, మద్యం సేవించి వాహనం నడపడం వంటి తదితర రోడ్డు భద్రతా ఉల్లంఘనదారులపై ఎం.వి చట్టం ప్రకారం చర్యలు తీసుకున్నారు. పోలీసు సేవలు ప్రజలకు మరింత చేరువయ్యేలా, పోలీస్ వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం పెరిగేలా విజిబుల్ పోలీసింగ్ కొనసాగిస్తున్నారు. మద్యం సేవించి వాహనం నడపడం, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడపడం వంటి నిబంధనల ఉల్లంఘనల వల్ల కలిగే ప్రమాదాల గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. అలాగే, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తూ ప్రజాశాంతికి భంగం కలిగించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు.
చట్ట వ్యతిరేక / అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేందుకు, గంజాయి వంటి మాదకద్రవ్యాల మరియు ఇతర అనుమానిత వస్తువులు రవాణా జరగకుండా నిరంతర వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు.